పాలిటెక్నిక్ విద్యార్థులకు జాబ్ మేళా.. జాబ్ మేళా తేదీలు ఇవే..
హెచ్‌ఎల్ మండో సంస్థ మానవవనరుల విభాగం డీజీఎం రాజశేఖర్, మేనేజర్ రాగిణిలతో కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళా ద్వారా 200 మంది టెక్నీషియన్ అప్రెంటీస్‌లుగా ఉపాధి పొందనున్నారని తెలిపారు. హ్యుందాయ్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, వోక్స్‌వ్యాగన్, ఆడి, చేవ్రొలెట్, కియా, సుజుకి తదితర ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో ఈ సంస్థ వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. ఒంగోలులోని డీఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు.
చదవండి: AP Govt Jobs: సీఎస్‌పీజీ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
2020, 2021, 2022 సంవత్సరాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. 60 శాతం మార్కులతో మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ విభాగాలలో ఉత్తీర్ణులైన బాల బాలికలు, ఎల్రక్టానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ విభాగాలలో ఉత్తీర్ణత సాధించిన బాలికలు అర్హులని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్‌గా రూ.14,050, సబ్సిడీపై ఇతర సౌకర్యాలు అందుతాయన్నారు.
చదవండి: AP Govt Jobs: ప్రకాశం జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.60,000 వరకు వేతనం..
సంవత్సరం తర్వాత వారి పనితీరు ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన సంస్థ అవకాశం కల్పిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 88709 85062, 89858 72905 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. డిప్యూటీ డైరెక్టర్ (శిక్షణ, ప్లేస్‌మెంట్) డాక్టర్ ఎం.ఎ.వి.రామకృష్ణ, సాంకేతిక విద్యాశాఖకు చెందిన అధికారుల బృందం జాబ్ మేళా కార్యక్రమాలను సమన్వయం చేస్తారని వివరించారు.
చదవండి: AP Govt Jobs: గుంటూరు జిల్లాలో 49 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..