Polycet 2023: విద్యతో భవితకు భరోసా
ఏప్రిల్ 13న ఆమె విలేకరులతో మాట్లాడుతూ పాలిటెక్నిక్ కోర్సులు చదవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులంతా పాలిసెట్–2023 పరీక్షకు ఏప్రిల్ 30వతేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 10వతేదీన పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు (కో–ఎడ్యుకేషన్) అవకాశం కల్పించామన్నారు. మెరుగైన బోధనకు సంబంధించి పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్లకు తక్కువ ఫీజు వసూలు చేస్తామన్నారు.
చదవండి: New Polytechnic Courses : జాబ్ గ్యారెంటీగా వచ్చే.. కొత్త పాలిటెక్నిక్ కోర్సులు ఇవే..
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వ,ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మరింత సమాచారానికి పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రంలో సంప్రదించాలన్నారు. పాలిసెట్–2023 పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు గాను ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.100, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
చదవండి: TS Exams: ఏప్రిల్ అంతా పరీక్షా కాలమే... తెలంగాణలో ఏయే ఎగ్జామ్ ఎప్పుడెప్పుడంటే