TS PGECET 2023: పీజీఈసెట్ కౌన్సెలింగ్ తేదీలు, సీట్లు కేటాయింపు తేదీ ఇవే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీలో ప్రవేశానికి జూలై నెలాఖరు నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో జూలై 19న పీజీఈసెట్ కౌన్సెలింగ్‌పై చర్చించిన అనంతరం షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 31 నుంచి ఆగస్టు 18 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 7 నుంచి 9 వరకు ప్రత్యేక కేటగిరీలకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
☛ Top 20 Engineering Colleges 2023 - Andhra Pradesh | Telangana
ఆగస్టు 21 నుంచి 23 వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. 26వ తేదీన సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 30లోగా సీటు వచ్చిన అభ్యర్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాలి. రెండోదశ కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్ 4 నుంచి చేపడతారు. సెప్టెంబర్ 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది.
Published date : 20 Jul 2023 03:21PM