Skip to main content

B.Sc Nursing Courses in YSRUHS: డాక్టర్‌ వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సులో ప్రవేశాలు

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (యూహెచ్‌ఎస్‌).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నర్సింగ్‌ కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
YSRUHS invites applications for admission into B.Sc Nursing Courses

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌–2023లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు, ప్రాసెసింగ్‌ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.2360, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1888. 

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌–2023 ర్యాంక్, రిజర్వేషన్‌ రూల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఏపీ ఈఏపీసెట్‌–2023 కటాఫ్‌ స్కోర్‌: జనరల్‌ కేటగిరీ: 35682 ర్యాంకు వరకు; బీసీ/ఎస్టీ/ఎస్సీ, బీసీ/ఎస్టీ/ఎస్సీ–దివ్యాంగులు: 42820 ర్యాంకు వరకు; జనరల్‌ కేటగిరీ దివ్యాంగులు: 38058 ర్యాంకు వరకు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.08.2023

వెబ్‌సైట్‌: https://drysr.uhsap.in/

చదవండి: GATE 2024 notification: గేట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం‌..

Last Date

Photo Stories