Admission in JNVST: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
అర్హత: విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.05.2011 నుంచి 30.04.2013 మధ్యలో జన్మించినవారై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
ప్రవేశ పరీక్షతేది: 2023 ఏప్రిల్ 29వ తేది ఉదయం 11.30 గంటలకు సంబంధిత జిల్లాలో ఎంపికచేసిన అన్ని కేంద్రాలలో నిర్వహిస్తారు.
ఫలితాల వెల్లడి తేది: జూన్ 2023.
వెబ్‌సైట్: https://navodaya.gov.in/
చదవండి: Admissions in TISS: టిస్ నెట్-2023 పీజీలో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..