Admissions in IIFT: ఐఐఎఫ్‌టీ, కోల్‌కతాలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ), కోల్‌కతా క్యాంపస్(డీమ్డ్ టు బి యూనివర్శిటీ).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రామ్ వివరాలు: సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ కన్సల్టెన్సీ.
అర్హత: 50శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో కనీసం మూడేళ్ల పని అనుభవం లేదా పీజీ(ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్)తో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ప్రవేశ ప్రక్రియ: ఇంటర్వ్యూ, అకడమిక్ రికార్డులు, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.11.2023
వెబ్‌సైట్: https://www.iift.ac.in/
చదవండి: CUET UG 2024: సీయూఈటీ-యూజీతో ప్రయోజనాలు, పరీక్ష విధానం, మెరుగైన స్కోర్‌కు మార్గాలు..
Last Date