తల్లిదండ్రుల స్ఫూర్తితోనే..: ఏపీ అగ్రి, మెడికల్ ఎంసెట్ మూడో ర్యాంకర్ మనోజ్ కుమార్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజీనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2020 పరీక్ష ఫలితాలను అక్టోబర్ 10న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు రమేష్ విడుదల చేశారు.
ఈ తరుణంలో ఎంసెట్ అగ్రి, మెడికల్ విభాగంలో మూడో ర్యాంకు సాధించిన మనోజ్ కుమార్ అభిప్రాయం ఆయన మాటల్లోనే..
నా తల్లిదండ్రులు డాక్టర్ ఆర్.వెంకట్, డాక్టర్ ఎం.రమాదేవి తిరుపతి రుయా ఆస్పత్రిలో పేద రోగులకు సేవలందిస్తున్నారు. వారి స్ఫూర్తితోనే ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించా. నీట్, ఎంసెట్‌కు శిక్షణ తీసుకుని పరీక్ష రాశా. తల్లిదండ్రుల తరహాలోనే వైద్యుడిగా రాణించి, సేవలందించాలన్నదే నా కోరిక. నీట్‌లోనూ మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా.
Published date : 12 Oct 2020 04:10PM