సిక్కోలు ప్రతిభకు.. చిహ్నం!
Sakshi Education
చాలీచాలని ఆదాయం. ఏ రోజుకారోజు కుటుంబ అవసరాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. తండ్రి నిర్వహించే చిన్న టీ కొట్టుపై వచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం. ఇన్ని కష్టాల కడలికి ఎదురీది దాదాపు ఐదు లక్షల మంది హాజరైన డైట్‌సెట్-2013లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయుడిగా నిలిచాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గుంటుకు శ్రీనివాసరావు. డైట్‌సెట్‌లో మొత్తం 100 మార్కులకు 86 మార్కులు సాధించిన శ్రీనివాస్ సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం:
శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలంలోని నిద్దాం మా ఊరు. నిరుపేద కుటుంబం. నాన్న ఊళ్లోనే చిన్న టీ కొట్టు నిర్వహిస్తారు. అమ్మ గృహిణి. చెల్లెలు ఎనిమిదో తరగతి చదువుతోంది. నాన్న సంపాదించే కొద్దిపాటి ఆదాయం కుటుంబ అవసరాలకు ఏ మాత్రం సరిపోక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా చదువు కోసం అమ్మానాన్న ఎంతో ప్రోత్సాహం అందించారు. ‘నువ్వేమీ బాధపడొద్దు. డబ్బుల సంగతి మేము చూసుకుంటాం’ అనేవారు.
విద్యాభ్యాసం:
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మా గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివాను. ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు మా మండల కేంద్రం జి.సిగడాంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. పదో తరగతిలో 574 మార్కులు వచ్చాయి. అయితే పై చదువులు చదవడానికి ఆర్థిక సమస్యలు అడ్డుకున్నాయి. అయితే అనుకోని వరంలా.. డోలా సూర్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ నన్ను ఆదుకుంది. వైజాగ్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదవడానికి కావలసిన ఆర్థిక చేయూతను ట్రస్ట్ అందించింది. అంతేకాకుండా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెండేళ్లపాటు నెలకు * 300 స్కాలర్‌షిప్ ఇచ్చింది. వీరందరి ఆపన్న హస్తంతో ఇంటర్ ఎంపీసీలో 974 మార్కులు సాధించాను.
ఇతర పోటీల్లోనూ విజేత గా నిలిచా..
పదో తరగతిలో ఉండగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీలో ప్రథమ స్థానం సాధించాను. ఇతర పోటీల్లోనూ వివిధ బహుమతులు వచ్చాయి. పదో తరగతి పూర్తికాగానే సీప్ (పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం) రాశాను. ఇందులో రాష్ట్రస్థాయిలో 1,500 ర్యాంకు వచ్చింది. అదేవిధంగా ఏపీఆర్‌జేసీ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 500వ ర్యాంకు సాధించాను. ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో: ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడంతో రాజాంలోని కోచింగ్ సెంటర్ డైట్‌సెట్‌కు ఉచిత కోచింగ్ ఇచ్చింది. నాకే కాకుండా ఇంటర్‌లో మంచి మార్కులు సాధించినవారికి కూడా ఈ సంస్థ ఉచిత శిక్షణనిచ్చింది. ఫ్యాకల్టీతోపాటు మా హైస్కూల్ ఉపాధ్యాయులు మంచి ప్రోత్సాహమందించారు.
విద్య, భవితలతో ఎంతో మేలు:
డైట్‌సెట్ కోసం ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఉన్న అకడెమిక్ పాఠ్యపుస్తకాలు బాగా చదివాను. అంతేకాకుండా కోచింగ్ సెంటర్‌లో ప్రతిరోజూ ఒక గ్రాండ్ టెస్టును సాధన చేసేవాడిని. ప్రతివారం మోడల్ టెస్టులు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పులను సరిదిద్దుకోవడం తేలికైంది. ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 వరకు చదివేవాడిని. అదేవిధంగా ఫ్యాకల్టీ బోధించేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను రన్నింగ్ నోట్స్‌గా రాసుకునేవాడిని. వీటితోపాటు సాక్షి విద్య, భవితలో అందించిన డైట్‌సెట్ మెటీరియల్, మోడల్ పేపర్లు ఎంతో ఉపయోగపడ్డాయి. వీటిల్లో ఇచ్చిన బిట్స్ నుంచి చాలా ప్రశ్నలు డైట్‌సెట్ పరీక్షలో వచ్చాయి.
టీచింగ్ అంటే గౌరవం:
ఇంటర్‌లో మంచి మార్కులు సాధించినా ఉన్నత విద్యవైపు ఆలోచించకపోవడానికి ఒకటే కారణం.. ఆర్థిక ఇబ్బందులు. ఇంజనీరింగ్ చదవాలనిపించినా మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్య ఆలోచనలు విరమించుకున్నాను. ఉపాధ్యాయ వృత్తి గౌరవంతో కూడుకుని ఉన్న రంగం. అందుకే డైట్‌సెట్ రాసి విజయం సాధించాను.
మాక్‌టెస్టులు సాధన చేయాలి:
వచ్చే ఏడాది డైట్‌సెట్ రాయాలనుకునేవారు అకాడెమీ పాఠ్యపుస్తకాలను బాగా చదవాలి. వీటితోపాటు మంచి కోచింగ్ తీసుకుని వీలైనన్ని మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు సాధన చేస్తే టాపర్‌గా నిలవొచ్చు.
దూరవిద్యలో డిగ్రీ చదువుతా:
నా లక్ష్యం ఐఏఎస్. కలెక్టర్ ఆయ్యాక నా మాదిరిగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడే విద్యార్థులందరికీ అండగా ఉంటా. ప్రస్తుతం డీఈడీ చదువుతూనే దూరవిద్య విధానం ద్వారా డిగ్రీ చదువుతా. ఆ తర్వాత సివిల్స్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తా.

Published date : 04 Jul 2013 06:16PM