సాఫ్ట్‌వేర్‌లో ఉన్నతస్థాయికి..: తెలంగాణ ఎంసెట్ 6వ ర్యాంకర్ నాగెల్లి నితిన్‌సాయి
Sakshi Education
తెలంగాణ ఇంజీనీరింగ్ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్టోబర్ 6న విడుదల చేశారు.
ఈ ఫలితాల్లో టాప్-10 ర్యాంకులను బాలురే కైవసం చేసుకున్నారు. అందులో 5 ర్యాంకులు తెలంగాణకు చెందిన విద్యార్థులు, మరో 5 ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులు సాధించారు. ఈ తరుణంలో తెలంగాణ ఎంసెట్ 6వ ర్యాంకర్ నాగెల్లి నితిన్‌సాయి తన సంతోషాన్ని పంచుకున్నారిలా..
ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది.
మాది నల్గొండ జిల్లాల్లోని మిర్యాలగూడ. ఐఐటీ ఎంట్రన్స్‌లోనూ ఓపెన్ కేటగిరీలో 423వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 48వ ర్యాంకు వచ్చాయి. నేను ఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో చేరి సాఫ్ట్‌వేర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని ఉంది. నేను మంచి ర్యాంక్ సాధించడానికి నా తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహమే కారణం.

Published date : 07 Oct 2020 06:48PM