పద్మశ్రీమూళిక్కళ్ పంకజాక్షి సక్సెస్ స్టోరీ...
Sakshi Education
పై పెదవి మీద తోలుబొమ్మను ఉంచుకుని, రామాయణ మహాభారత కథలను నాలిక మీద ఆడిస్తున్న ఏకైక కళాకారిణి కేరళకు చెందిన మూళిక్కళ్ పంకజాక్షి. తల్లిదండ్రులు నేర్పిన ‘నూక్కు విద్య పవక్కలి’ (తోలు బొమ్మలాట)ని ఆమె తన పన్నెండవ ఏట నుంచే కాపాడుకుంటూ వస్తున్నారు.
కేరళలోని మోనిపల్లె తాలూకా కొట్టాయం వారిది. భర్త శివరామ పాణిక్కర్ కూడా కళాకారుడే. మధుర స్వరంతో శివరామ పాడుతూ, వాద్యాలను ఉపయోగించటం వల్లే తన కథకు మరింత అందం చేకూరి, తాను అందరికీ పరిచితురాలినయ్యాను అంటారు పంకజాక్షి. ఐదు వందల సంవత్సరాల నాటి ఈ విద్యను, ఈ శతాబ్దంలో నేటికీ సజీవంగా ఉంచిన ఏకైక వ్యక్తి పంకజాక్షి. ఆమెను ఈ విద్య నేర్చుకోమని తల్లిదండ్రులు ఎన్నడూ ఒత్తిడి తీసుకురాలేదు. మొదట్లో తన ఇంటిముందరే కాళ్లను బారచాచి, పైకి చూస్తూ, చిన్న చిన్న కొబ్బరి కాయ పిందెలను పెపైదవి మీద గంటలుగంటలు బ్యాలెన్స్ చేసేది. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్న సమయాలలో సాధన చేసిన పంకజాక్షి, వివాహం వల్ల కాని, పిల్లల వల్ల కాని ఎన్నడూ ఎటువంటి ఆటంకం కలగలేదని అంటారు. ఆమె మనుమరాలు కె. ఎస్. రంజని కూడా ఈ కళను కొనసాగిస్తున్నారు.
పంకజాక్షి ఆరు సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా ఈ విద్యను ప్రదర్శించటం లేదు. ఆసక్తి ఉన్నవారికి తన ఇంటి దగ్గర ఈ విద్యను నేర్పుతున్న పంకజాక్షికి పద్మశ్రీ అవార్డు లభించింది.
పంకజాక్షి ఆరు సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా ఈ విద్యను ప్రదర్శించటం లేదు. ఆసక్తి ఉన్నవారికి తన ఇంటి దగ్గర ఈ విద్యను నేర్పుతున్న పంకజాక్షికి పద్మశ్రీ అవార్డు లభించింది.
Published date : 31 Jan 2020 06:34PM