ఆ ఓటమి నుంచే...'స్విగ్గీ' పుట్టిందిలా...
Sakshi Education
నందన్ రెడ్డిది కడప. శ్రీహర్ష మాజేటిది విజయవాడ. ఒకరు ఎమ్మెస్సీ.. మరొకరు ఇంజినీరింగ్. కాకపోతే ఇద్దరూ చదివింది మాత్రం బిట్స్ పిలానీలోనే.
శ్రీహర్ష ఇంజినీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. ఎవరైనా చేరేవారేమో!! కానీ శ్రీహర్ష వద్దనుకున్నాడు. క్యాట్ రాసి ఐఐఎం కోల్‌కతాలో చేరాడు. పూర్తవుతూనే లండన్‌లోని ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ పిలిచింది. లండన్ బాగుంటుందని వెళ్ళాడు. సిటీ నచ్చింది కానీ అక్కడి ఉద్యోగం నచ్చలేదు. రెండేళ్లు చేసి వెనక్కి వచ్చేశాడు. స్నేహితుడు నందన్ కలిశాడు. నందన్ అప్పటికే చిన్న వ్యాపారాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. 'టెక్నాలజీ, ఉద్యోగాలు, లాజిస్టిక్స్' మూడూ కలిసి ఉండే కంపెనీని పెడదామనుకున్నారు. సొంత వెబ్‌సైట్లున్న వ్యాపారులు... డెలివరీ చేయలేక ఈ–కామర్స్ సంస్థల్లో నమోదు చేసుకుంటున్నారని గ్రహించి... వారిని, డీటీడీసీ– ఫెడెక్స్– తదితర కొరియర్ సంస్థలను కలిపేలా 'డెమొక్రటిక్ షిప్పింగ్'కు రూపకల్పన చేశారు. దీని కోసమే 2013లో 'బండిల్'ను ఆరంభించారు. కాకపోతే దీనికి తగ్గ టెక్నాలజీని అభివృద్ధి చేయటం వారి వల్ల కాలేదు. ఆ పనిని ఓ కంపెనీకి అప్పగించారు. అది పూర్తయ్యేసరికి ఏడాది పైనే పట్టింది. తాము తయారు చేయదలచుకున్న ఉత్పత్తి బయటికొచ్చేసరికి మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు సొంత డెలివరీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
''మార్కెట్‌కు మా ఉత్పత్తి పనికిరాదని అర్థమైపోయింది. అదృష్టమేంటంటే మాకు వేరే ఉద్యోగులు లేరు. మేం తప్ప ఎవరూ ఇన్వెస్ట్ చేయలేదు కూడా. అప్పులు కూడా లేవు. ఏడాదిలోపే బండిల్‌ను మూసేశాం'' అంటారు స్విగ్గీ ద్వయం. 'బండిల్' ప్రయాణంలో వారికి కొన్ని విషయాలు తెలిసొచ్చాయి. దేశంలో లాజిస్టిక్ కంపెనీలు దయనీయంగా ఉన్నాయని, వాటికి టెక్నాలజీ ఏమాత్రం అందుబాటులో లేదని తెలిసింది. దీంతో 2014 సెప్టెంబర్లో రెస్టారెంట్లను, వినియోగదార్లను తమ సొంత డెలివరీ యంత్రాంగంతో కలుపుతూ బెంగళూరులో స్విగ్గీని ఆరంభించారు. తరవాత వారికి మరో స్నేహితుడు రాహుల్ జైమిని వారికి తోడయ్యాడు. ఇపుడు దేశంలోని 13 నగరాల్లో సేవలందిస్తున్న స్విగ్గీకి 50 లక్షల మంది కస్టమర్లున్నారు. 25 వేల రెస్టారెంట్లతో ఒప్పందాలున్నాయి. భారీగా నిధులూ వచ్చాయి. సంస్థ విలువ... దాదాపు రూ.17వేల కోట్లు!!.

Published date : 13 Nov 2020 01:06PM