Skip to main content

న్యూరాలజిస్ట్ అవుతా.. : ఏపీ అగ్రి, మెడికల్ ఎంసెట్ సెకండ్ ర్యాంకర్ త్రిపురనేని లక్ష్మీసాయి మారుతి

ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇంజీనీరింగ్, ఫార్మ‌సీ, అగ్రికల్చ‌ర్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన ఎంసెట్‌-2020 ప‌రీక్ష ఫ‌లితాల‌ను అక్టోబ‌ర్ 10న విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు ర‌మేష్ విడుద‌ల చేశారు.
ఈ త‌రుణంలో ఏపీ అగ్రి, మెడికల్ ఎంసెట్ సెకండ్ ర్యాంకర్ త్రిపురనేని లక్ష్మీసాయి మారుతి అభిప్రాయం ఇలా..
నాన్న శ్రీనివాసరావు ప్రైవేటు కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకులు. అమ్మ సువర్చల గృహిణి. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆనందాన్నిచ్చింది. నీట్‌లో ర్యాంకు ద్వారా ఎయిమ్స్‌లో సీటు సాధించడం నా లక్ష్యం. లాక్‌డౌన్ విధించినది మొదలు సెప్టెంబర్ వరకు అధ్యాపకులు ఆన్‌లైన్‌లో చెప్పిన తరగతులకు హాజరయ్యాను. ఆన్‌లైన్‌లో 200 పరీక్షలు రాశాను. న్యూరాలజిస్ట్‌గా ఎదగాలనే ఆశయంతో ఉన్నాను.
Published date : 12 Oct 2020 04:09PM

Photo Stories