ఇంటర్న్‌షిప్‌తో కెరీర్‌కి పునాది.. భవిష్యత్తుపై ధీమా: ఐఐటీ మండి విద్యార్థి పజ్వల్ ఝా
Sakshi Education
విద్యార్థి ఎంచుకున్న రంగంలో రాణించేందుకు ఇంటర్న్‌షిప్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నాడు ఐఐటీ మండిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి.. ప్రజ్వల్ ఝా. ఇతను ఇటీవల న్యూయార్క్‌లోని డి.ఈ.షా కంపెనీలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాడు. కోవిడ్ కారణంగా వర్చువల్ విధానంలో పూర్తి చేసినట్టు చెబుతున్న ఝా.. ఇంటర్న్‌షిప్ అనుభవాలు అతని మాటల్లోనే..
కంప్యూటర్ సైన్‌స అంటే నాకు చాలా ఇష్టం. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలని ఎంతో కష్టపడి ఐఐటీ-మండిలో బీటెక్ కంప్యూటర్ సైన్‌సలో సీటు సాధించాను. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నాను. మేము కోర్సులో భాగంగా తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ కమ్రంలో ఈ ఏడాది న్యూయార్క్ (అమెరికా)లోని డి.ఈ.షా కంపెనీలో అవకాశం లభించింది. వాస్తవానికి నేను అక్కడకు వెళ్లి ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. కానీ కోవిడ్ వల్ల వర్చువల్‌గానే ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి వచ్చింది.
మొదట భయపడ్డా..
కార్పొరేట్ ప్రపంచంలో ఇది నా మొదటి అనుభవం. మొదట్లో అంతా కొత్తగా ఉండేది. టెక్నికల్ విధానాలు భయపెట్టేవి. కోడింగ్ కూడా కొత్తగా ఉండేది. అయితే నాకు కేటారుుంచిన టెక్నికల్ టీమ్, కంపెనీ మేనేజర్ ఎంతో సహకరించారు. వారి సాయంతో నా టాస్క్‌లను పూర్తి చేయగలగడంతో పాటు ఫైనల్ డెమో సజావుగా సాగింది. ఎన్నో కీలకమైన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాను. ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో, కొత్త ప్రాంతంలో గడపాల్సి వస్తుంది. మొదట కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడం కొంత కష్టంగా అనిపిస్తుంది. కానీ కాస్త ఓర్పు, పట్టుదల, కృషితో ఈ సమస్యను అధిగమించొచ్చు.
వర్సువల్‌తో కొంత ఇబ్బంది..
ఇంటర్న్‌షిప్ అంటే కేటాయించిన సంస్థలో అక్కడి వాతావరణంలో వారి సిబ్బందితో కలిసి పనిచేసి సబ్జెక్టును నేర్చుకోవాలి. కాని కోవిడ్ కారణంగా అమెరికా వెళ్లలేని పరిస్థితి. దాంతో డి.ఈ.షా ప్రతినిధులు ప్రతి ఇంటర్న్‌ను సులభంగా ఆన్‌బోర్డ్‌లోకి తీసుకురావడానికి, ఇంటర్న్‌షిప్ సమయంలో మేం సబ్జెక్టును నేర్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వర్చువల్ విధానం కావడంతో నెట్ ప్రాబ్లమ్స్, వేర్వేరు టైమ్ జోన్స్ వంటివి ఇబ్బంది పెట్టాయి. కానీ నిర్వాహకులు స్టూడెంట్ అడిగే ప్రతి ప్రశ్నకు చాలా ఓపిగ్గా సమాధానం చెప్పడంతోపాటు స్నేహపూర్వక వాతావరణంలో ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేలా చూశారు. కంప్యూటర్ సైన్స్ వరకు వర్చువల్ విధానంతో ఇబ్బంది లేకున్నా.. కోర్ సబ్జెక్టుల్లో మాత్రం వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా చేస్తే.. సబ్జెక్టుపై మరింత పట్టు వస్తుందని నా అభిప్రాయం.
కొత్తవారికి నా సలహా..
మీకు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు మొదట కంగారు పడకండి. భవిష్యత్‌లో ఇలాంటి టాస్క్‌లు, సవాళ్లు చాలానే ఎదుర్కోవాల్సి వస్తుంది. టాస్క్ అర్థం కానప్పుడు ఎన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయో అన్నీ ప్రయత్నించాలి. సీనియర్స్‌ను సందేహాలు అడిగేందుకు ఎప్పుడూ భయపడకూడదు. మొహమాటం లేకుండా అడిగినప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలం. ముందు సబ్జెక్టు అర్థం చేసుకొని.. సమస్యను వివరించేందుకు సిద్ధం కావాలి.
భవిష్యత్‌కు ప్రణాళిక...
ఇంటర్న్‌షిప్ అనేది కెరీర్‌కు పునాది వంటిది. దాన్ని పూర్తి అంకిత భావంతో చేయాలి. ఇంటర్న్‌షిప్‌లో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారేందుకు ఏం చేయాలో తెలుసుకోగలిగాను. నా భవిష్యత్ ప్రాజెక్టులకు నా ఇంటర్న్‌షిప్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా రాణించడమే నా లక్ష్యం!!

Published date : 22 Oct 2020 06:07PM