ఈ తపనే బేబీ చక్రను సక్సెస్ అయ్యేలా చేసింది..
Sakshi Education
నయ్యా సగ్గి గురించి ఆమె తల్లికెప్పుడూ ఆందోళనే. ఎందుకంటే స్కూలు స్థాయిలో సగ్గి మార్కులు అంతంత మాత్రంగానే ఉండేవి. ‘పెద్దయ్యాక ఏమవుతావో’ అని తల్లి ఎప్పుడూ బెంగపడుతూనే ఉండేది.
ముంబైకి చెందిన సగ్గి... అందరు పిల్లల్లానే ఆ వయసులో ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలూ లేకుండానే పెరిగింది. కాకపోతే అప్పుడప్పుడూ నేషనల్ లా స్కూల్‌లో చదివే తన సోదరి చెప్పే మాటలు మాత్రం ఆమెను ఆకర్షించేవి. ఒక దశలో... తానూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్‌లో చదవాలని ఫిక్సయిపోయింది. తల్లి ఆందోళన పెరిగిపోయింది. ‘తరవాత బాధ పడతావేమో!’ అని హెచ్చరించింది. సగ్గి తను గనక ఒక నిర్ణయం తీసుకుంటే... ఇక ఎవరి మాటా వినే ప్రసక్తే లేదు. కష్టమైన లా ఎంట్రన్స్ నెగ్గి... ఎన్‌ఎల్‌ఎస్‌లో సీటు సంపాదించింది. అదిగో... అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ‘అదంతా వేరే ప్రపంచం. ఆడుతూ..పాడుతూ గడిచిపోయింది. కెజి బాలకృష్ణన్ వంటి న్యాయ మూర్తులతో పాటు విదేశీ న్యాయ నిపుణులనూ కలిసే అవకాశం దక్కింది’ అంటారామె. చదువుతున్నపుడే స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ కోసం పని చేసింది సగ్గి. అదిగో... ఆ తపనే ఆమెకు ప్రతిష్ఠాత్మక ఫుల్‌బ్రైట్, హార్వర్డ్ స్కాలర్‌షిప్‌లు తెచ్చిపెట్టింది.
హార్వర్డ్‌లో నాలుగేళ్లూ ఇట్టే గడిచిపోయాయి. ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, వాటిని భారీస్థాయికి తీసుకెళ్లటం వంటి అంశాలపై ఆమె ప్రాజెక్టు చేసింది. తరవాత ఇండియాకు తిరిగొచ్చింది. ‘ఏం చేసినా ఒక తరాన్ని ప్రభావితం చేయగలగాలి’ అనుకునే సగ్గి... తన స్నేహితులు తల్లి కాబోయేటపుడు సరైన సమాచారం, ఉత్పత్తులు దొరక్క పడుతున్న ఇబ్బందులు గమనించింది. న్యూక్లియర్ కుటుంబాల కారణంగా... ఇంటర్నెట్‌లో టూర్ ప్యాకేజీలు, సినిమా టికెట్లు కూడా బుక్‌చేసే తల్లిదండ్రులు... పిల్లల విషయంలో మాత్రం సరైన సలహా పొందలేక పోతున్నారని గ్రహించింది. పాత స్నేహితుడు మొహిత్ కుమార్‌తో అన్నీ చర్చించింది. అదిగో... అక్కడే ‘బేబీ చక్ర’ రూపుదిద్దుకుంది. కాబోయే తల్లిదండ్రుల నుంచి.. బిడ్డను కన్న తల్లిదండ్రుల వరకూ వారికి కావాల్సిన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా ఇప్పిస్తూ... వారికి మార్గ దర్శకత్వం వహించటమే బేబీ చక్ర పని. అంతేకాదు. బేబీ ఉత్పత్తులు, ఇతరత్రా సర్వీసులు అందించేవారు కూడా దీన్లో లిస్టయ్యారు. మొత్తమ్మీద పిల్లల జీవితానికి కావాల్సిన అన్నిటినీ సంస్థ అందిస్తోంది. ఇటీవలే రెండు దశలుగా నిధులు కూడా వచ్చాయి. తొలినాళ్లలోనే ముంబై ఏంజిల్స్ పెట్టుబడి పెట్టగా... తరవాత విదేశీ నిధులొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ సగ్గి తల్లికి కుమార్తె విషయంలో ఆందోళనే. వారానికోసారి ఫోన్‌చేసి... ‘‘బేబీ చక్రలో కొత్తగా ఏం వచ్చాయి?’’ అని అడుగుతుంటుంది.

Published date : 20 Nov 2020 01:37PM