Skip to main content

ధాన్యలక్ష్మి..పద్మశ్రీ‘రహీబాయ్ సోమా’ సక్సెస్ స్టోరి

సంకర విత్తనాల కంటె దేశీ విత్తనాల వల్లే సేంద్రియ వ్యవసాయం సాధ్యమని భావించారు మహారాష్ట్రలోని కొంభల్నే గ్రామానికి చెందిన రహీబాయ్ సోమా. ఆలోచనలను ఆచరణలో పెడితేనే ఏ వ్యక్తయినా ఉన్నతస్థాయికి చేరుకుంటారని ఆమె నమ్ముతారు.
ఏడుగురు సభ్యులున్న రహీబాయ్ సోమా కుటుంబం ఉపాధికోసం ఔరంగాబాద్ జిల్లా ఆకోలే తాలూకాకు చేరుకున్నాక, కొత్త జీవితం ప్రారంభించారు. వర్షాకాలంలో వ్యవసాయం చేస్తూ, మిగతా సమయంలో పంచ దార ఫ్యాక్టరీలో రోజు కూలీలుగా పనిచేసేవారు కుటుంబంలోని వాళ్లంతా. అయితే ఆ జీవితం రహీబాయ్ సోమాకు నచ్చలేదు. వారి కున్న ఏడు ఎకరాలలో మూడు ఎకరాల మీద శ్రద్ధ పెట్టారు రహీబాయ్ సోమా. భూమి సారవంతంగా ఉంటేనే మంచి పంట దిగుబడి వస్తుందని ఆమెకు బాగా తెలుసు. నేలను తడిగా ఉంచటం కోసం తన పొలంలో వ్యవసాయ చెరువును అంటే జలకుండాన్ని తవ్వించి, కూరగాయలు పండించటం ప్రారంభించారు.

ఆమెలోని పట్టుదలను గమనించిన మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఫర్ రూరల్ ఏరియాస్ వారు ఆమెకు సహకరించారు. దానితో రహీబాయ్ సోమా కోళ్లఫారం, మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. పంటలు చక్కగా పండించటం కోసం దేశీ విత్తనాలను సంరక్షించటం కోసం విత్తనాల బ్యాంకును నెలకొల్పి, సీడ్ మదర్‌గా గుర్తింపు పొందారు. దాచిన విత్తనాలను పొరుగు రైతులకు ఇస్తూ, వారు కూడా ఫలితం పొందేందుకు సహకరిస్తున్న రహీబాయ్ సోమాను పద్మశ్రీ పురస్కారం వెతుక్కుంటూ వచ్చింది.
Published date : 31 Jan 2020 06:37PM

Photo Stories