డేటా సైంటిస్టునవుతా..: తెలంగాణ ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ సాయితేజ వారణాసి
Sakshi Education
తెలంగాణ ఇంజీనీరింగ్ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్టోబర్ 6న విడుదల చేశారు.
ఈ ఫలితాల్లో టాప్-10 ర్యాంకులను బాలురే కైవసం చేసుకున్నారు. అందులో 5 ర్యాంకులు తెలంగాణకు చెందిన విద్యార్థులు, మరో 5 ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులు సాధించారు. ఈ తరుణంలో తెలంగాణ ఎంసెట్ సాయితేజ వారణాసి తన సంతోషాన్ని పంచుకున్నారిలా..
మాది ఏపీలోని విజయనగరం. హైదరాబాద్‌లో ఇంటర్ చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 51వ ర్యాంక్ వచ్చింది. నాన్న విజయరామయ్య, అమ్మ శాంతకుమారి ఫిజిక్స్ టీచర్లు. వారి ప్రోత్సాహంతోనే టాప్ ర్యాంక్ సాధించా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివి డేటా సైంటిస్టు కావాలనేది నా లక్ష్యం.
Published date : 07 Oct 2020 06:39PM