డాక్టరు కావాలనేదే లక్ష్యం..: ఏపీ అగ్రి, మెడికల్ ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ గుత్తి చైతన్యసింధు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజీనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2020 పరీక్ష ఫలితాలను అక్టోబర్ 10న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు రమేష్ విడుదల చేశారు.
ఈ తరుణంలో ఏపీ అగ్రి, మెడికల్ ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ గుత్తి చైతన్యసింధు తన అభిప్రాయాన్ని తెలిపారిలా...
మా తాత డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం, తల్లిదండ్రులు కోటేశ్వరప్రసాద్, సుధారాణి డాక్టర్లే. వారిలా డాక్టర్ కావాలనేదే నా లక్ష్యం. నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం ఉంది. ఇంటర్ విజయవాడలో ప్రైవేట్ విద్యాసంస్థలో చదివి 985 మార్కులతో సాధించాను. చదువును కష్టంలా భావించకుండా ఇష్టపడి చదివాను.
Published date : 12 Oct 2020 04:08PM