చదువుల సిరికిరూ.75 లక్షల వేతనం!
Sakshi Education
కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు రాకముందే ఓ మంచి సంస్థలో కోరుకున్న కొలువు చేతికి చిక్కాలని ఇంజనీరింగ్ విద్యార్థులు ఆశపడతారు. అయితే ప్రపంచంలోనే ఇంటర్నెట్ ఆధారిత సేవలు, ఉత్పత్తుల్లో గొప్ప సంస్థ అయిన గూగుల్‌లో ఉద్యోగం లభిస్తే, ఆపై కళ్లుచెదిరే వేతన ప్యాకేజీ సొంతమైతేఆ ఆనందానికి హద్దే ఉండదు. అలాంటి అద్భుత అవకాశాన్ని ఐఐటీ-బాంబేలో కంప్యూటర్స్ సైన్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న తోటకూర శ్రీమేఘన సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్త పోటీని ఎదుర్కొని, ఏకంగా ఏడాదికి రూ.75 లక్షల వేతనంతో ఉద్యోగాన్ని దక్కించుకున్న శ్రీమేఘన తన అనుభవాలను భవితతో పంచుకున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావ్ పేట మా స్వగ్రామం. అమ్మ వాణి... రామగుండం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. నాన్న తోటకూర శ్రీనివాస్ ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. చెల్లి అనన్య పదో తరగతి చదుతోంది. అమ్మానాన్న ఉద్యోగాల రీత్యా పాఠశాల విద్యాభ్యాసం అంతా కరీంనగర్ జిల్లాలోని రామగుండంలోనే జరిగింది. 8వ తరగతి వరకు దగ్గర్లోని సెయింట్ క్లెయిర్ పాఠశాలలో చదివాను. 9, 10 తరగతులు విజయవాడలోని హాస్టల్‌లో ఉంటూ అక్కడి కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివా.
పతిభ- ప్రోత్సాహం:
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పర్సనల్ మోటివేషన్‌తో చదువులో ప్రతిభ చూపగలిగాను. పదోతరగతిలో 600లకు 572 మార్కులు (95.3 శాతం) సాధించాను. ఇంటర్మీడియెట్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తిచేశాను. ఇంటర్‌లో 953 మార్కులు సాధించి పదోతరగతితో సమానంగా మార్కుల శాతాన్ని పొందాను. ఐఐటీ ప్రవేశ పరీక్షలోనూ 52 ర్యాంకు సాధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీటు సొంతం చేసుకున్నాను. ఐఐటీలో చదివితే విస్తృత అవకాశాలు అందుబాటులో ఉంటాయని ముందుగానే తెలుసు. అయితే సాఫ్ట్‌వేర్ రంగంలోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా.
ఇంటర్న్‌షిప్-మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం:
ఇంజనీరింగ్ మూడో ఏడాది పూర్తయ్యాక వేసవి సెలవుల్లో మైక్రోసాఫ్ట్ ఐడీపీలో ఇంటర్‌నషిప్ చేయడానికి అవకాశం లభించింది. రెండున్నర నెలలు ఇంటర్న్‌షిప్ చేశాను. అందులో ప్రతిభ ఆధారంగా ఆ కంపెనీ కొందరికి ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. ఇంటర్‌న షిప్‌ను సమర్థంగా పూర్తి చేయడంతో మైక్రోసాఫ్ట్-ఇండియాలో ప్లేస్‌మెంట్స్‌కు ముందే రూ.18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సొంతం చేసుకున్నాను.
ప్లేస్‌మెంట్స్- గూగుల్‌లో ఎంపిక:
ప్రీప్లేస్‌మెంట్‌లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం లభించిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీలకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాను. ఫేస్‌బుక్ రాత పరీక్ష, తొలి ఇంటర్వ్యూలో అర్హత సాధించినప్పటికీ రెండో ఇంటర్వ్యూలో నిరాశ ఎదురైంది. తర్వాత గూగుల్‌లో ప్రశాంతంగా పరీక్షను ఎదుర్కొన్నాను. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా రిటెన్ స్క్రీనింగ్, కోడింగ్ టెస్ట్‌లో అర్హతతోపాటు మూడు దశలుగా నిర్వహించిన ఇంటర్వ్యూలోనూ విజయం సాధించాను. ఏడాదికి సుమారు రూ.75 లక్షల వేతన ప్యాకేజీ సొంతం చేసుకున్నాను.
పిపరేషన్:
ఇంజనీరింగ్ మొదట్నుంచీ ప్లేస్‌మెంట్ ఓరియెంటెడ్‌గా చదవలేదు. అకడమిక్ సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాను. అల్గారిథమిక్ కోడింగ్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆధారంగా సన్నద్ధమయ్యాను. ప్లేస్‌మెంట్స్‌కు రెండు నెలల ముందు నుంచి ప్రిపరేషన్‌ను ప్రారంభించాను.
సలహా:
ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సమ్మర్ వెకేషన్‌లో ఏదైనా కంపెనీలో ఇంటర్‌నషిప్ చేయాలి. దాని ద్వారా కార్పొరేట్ ఎక్స్‌పోజర్ పెరుగుతుంది. పని సంస్కృతిని ముందే తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అల్‌గారిథమిక్ కోడింగ్‌నూ ప్రాక్టీస్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌నూ పెంచుకోవాలి. నేర్చుకున్న అంశాలను బాగా వ్యక్తీకరించగలగాలి. అప్పుడే వాటి నుంచి సరైన ఫలితం లభిస్తుంది.

Published date : 13 Dec 2014 04:38PM