చాలా సంతోషంగా ఉంది..: ఏపీ ఇంజనీరింగ్ ఎంసెట్ మూడో ర్యాంకర్ గంగుల భువన్‌రెడ్డి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజీనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2020 పరీక్ష ఫలితాలను అక్టోబర్ 10న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు రమేష్ విడుదల చేశారు.
ఈ తరుణంలో ఏపీ ఇంజనీరింగ్ ఎంసెట్ మూడో ర్యాంకర్ గంగుల భువన్‌రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారిలా..
ఎంసెట్‌లో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించా. 160 మార్కులకు 155.48 మార్కులు వచ్చాయి. ఈనెల 5న వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆలిండియా రెండో ర్యాంక్ వచ్చింది. అందులో 396కు 345 మార్కులు వచ్చాయి. ఈ ర్యాంక్ ఆధారంగా ముంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నా. ఈ ఏడాది సాధించిన ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉంది.
Published date : 12 Oct 2020 04:07PM