ఐఐటీ బాంబేలో చదువుతా: ఎంసెట్ 5వ ర్యాంకర్ హార్దిక్ రాజ్‌పాల్
Sakshi Education
తెలంగాణ ఇంజీనీరింగ్ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్టోబర్ 6న విడుదల చేశారు.
ఈ ఫలితాల్లో టాప్-10 ర్యాంకులను బాలురే కైవసం చేసుకున్నారు. అందులో 5 ర్యాంకులు తెలంగాణకు చెందిన విద్యార్థులు, మరో 5 ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులు సాధించారు. ఈ తరుణంలో తెలంగాణ ఎంసెట్ 5వ ర్యాంకర్ హార్దిక్ రాజ్‌పాల్ తన సంతోషాన్ని పంచుకున్నారిలా..
ఇంజనీరింగ్ ఎంసెట్‌లో 5వ ర్యాంక్ వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌లో ఆలిండియా కేటగిరీలో 6వ ర్యాంక్ సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేస్తాను. చదువైపోగానే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయినై సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లలాగా ఎదిగి నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసురావాలని ఉంది.
Published date : 07 Oct 2020 06:46PM