Skip to main content

Sakshi NEET Mock Test 2022 Results : సాక్షి మాక్‌ నీట్‌ పరీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప్‌-10 ర్యాంక‌ర్ల‌కు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ సాక్షి మాక్‌ నీట్ 2022 ప‌రీక్ష ఫ‌లితాలను విడుద‌ల చేశారు. ఈ సాక్షి మాక్‌ నీట్‌ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో జరిగిన విష‌యం తెల్సిందే.
Sakshi NEET Mock Test 2022 Results
Sakshi NEET Mock Test 2022 Results

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌. ఇందులో అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించేందుకు మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. ఇందు కోసం ఎంత‌ ఖర్చుకైన‌ వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ప‌రీక్ష‌ నీట్‌. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో నీట్‌ పరీక్షకు సాక్షి మాక్‌టెస్ట్‌ను నిర్వహించింది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు అనే ఉద్ధేశ్యంతో సాక్షి ఈ నీట్ మాక్‌టెస్ట్‌ను నిర్వ‌హించింది. ఈ సాక్షి మాక్‌ టెస్టులో ఉత్తమ ప్రతిభను క‌న‌బ‌రిచిన టాప్‌ టెన్‌ ర్యాంకర్ల‌కు ఆకర్షణీయ బహుమతులు ఇవ్వ‌నున్నారు. సాక్షి మాక్‌ నీట్‌-2022 ఫ‌లితాల కోసం www.sakshieducation.comలో చూడండి.

సాక్షి మాక్‌ నీట్‌-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Published date : 09 Jul 2022 01:47PM

Photo Stories