Skip to main content

MBBS Admissions: ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

జనగామ: తెలంగాణలో మెడికల్‌(ఎంబీబీఎస్‌) సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
MBBS Admissions
ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

అభ్యర్థుల సంఖ్య ఆధారంగా యూనివర్సిటీ ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. జనగామకు ఇటీవ ల మంజూరైన మెడికల్‌ కళాశాలలో సెప్టెంబ‌ర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ తరగతుల కోసం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రా రంభం కాగా, ఇప్పటి వరకు సెంట్రల్‌, స్టేట కోటా కలుపుకుని 70 మంది విద్యార్థులు రిపోర్టు చేసి జాయిన్‌ అయ్యారు.

చదవండి: Medical College Admissions: మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం

ఆగ‌స్టు 25న‌ చంపక్‌హిల్స్‌ మాతా శిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌) లో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోపాల్‌రావు ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు పరిశీలించా రు. స్టే కోటాకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నేటితో ముగియనుండగా, సెంట్రల్‌కు ఆగ‌స్టు 28 వర కు ముగుస్తుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న సీట్లతో పాటు స్లైడింగ్‌(మరో కళాశాలకు అవకాశం) చేసుకునే విద్యార్థులకు రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు.

చదవండి: MBBS Admissions: SIMSలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు

Published date : 26 Aug 2023 03:11PM

Photo Stories