నీట్ పరీక్షకి.. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్ టిప్స్ ఇలా..
Sakshi Education
నీట్ ఫిజిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలని అర్థం అవుతోంది. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి.
- ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు
కెమిస్ట్రీ.. పునశ్చరణ
జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది.
- విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు
బయాలజీ.. కాన్సెప్ట్‌లపై పట్టు..
నీట్–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేష్స అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రా్సపోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్ష్సలో కణ విభజన (సమవిభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షS నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టి పెట్టాలి. నీట్‌లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి.
- బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు
జువాలజీలో ఇలా..
జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం.
- కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు
అనలిటికల్ అప్రోచ్‌తో ఎంతో మేలు..
నీట్ ప్రిపరేషన్ క్రమంలో అనలిటికల్ అప్రోచ్‌తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం, ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే వీక్లీ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది.
– అనంత పరాక్రమ్ భార్గవ్, నీట్–2020 11వ ర్యాంకు
ఇంకా చదవండి: part 1: ఆగస్ట్ 1వ తేదీన నీట్–యూజీ–2021 పరీక్ష.. ర్యాంక్ సాధించే మార్గం ఇదే..!

Published date : 30 Mar 2021 03:53PM