Skip to main content

NEET UG 2024 Question Paper Leak Update News : నీట్ 2024 పేపర్ లీక్ ..? ఆ కేంద్రంలో ఏమి జ‌రిగిందంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి మే 5వ తేదీన(ఆదివారం) నీట్ యూజీ (NEET UG 2024) ప‌రీక్ష జ‌రిగిన విష‌యం తెల్సిందే.
NEET UG 2024

దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్ష నిర్వహించారు. 

దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఏపీ నుంచి 70 వేలమంది ఈ పరీక్ష రాసినట్టు అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల మంది నీట్ 2024 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు కాగా, 13 లక్షల మంది అమ్మాయిలున్నారు. ఇక 24 మంది ధర్డ్ జెండర్ విద్యార్ధులున్నారు.

☛  NEET Scandal: తమ్ముడి ‘నీట్‌’ రాసేందుకు అన్న చీటింగ్‌, ఎలా దొరికిపోయాడంటే..

జరిగిన పొరపాటును..
ఓ సెంటర్ లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు వార్తలు రావడంతో ఆందోళన రేగింది. ఎన్టీఏ దీనిపై క్లారిటీ ఇచ్చింది. అయితే పరీక్ష ముగిసిన కాస్సేపటికి పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వ్యాపించాయి. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో హిందీ మీడియం విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం ప్రశ్నాపత్రాలిచ్చారు. జరిగిన పొరపాటును అక్కడున్న ఇన్విజిలేటర్ సరిదిద్దేలోగా విద్యార్ధులు బలవంతంగా పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. 

ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో..

neet paper leak 2024 telugu news

నిబంధనల ప్రకారం విద్యార్ధులు అలా వెళ్లకూడదు. పరీక్ష ముగిసిన తరువాతే వెళ్లాలి. దాంతో ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందని, పేపర్ మాత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ పొరపాటుపై చర్యలు తీసుకోనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఆ సెంటర్‌లోని 120 మంది విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించే ఆలోచనలే ఎన్టీఏ ఉంది. బాధిత విద్యార్ధులకు మరో తేదీలో నీట్ పరీక్ష నిర్వహించవచ్చు. 

Also Check: NEET Telangana Cut-off Ranks: KNRUHS MBBS Last Ranks 2023

Published date : 06 May 2024 03:18PM

Photo Stories