Skip to main content

NEET-PG Mock Test: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో నీట్‌–పీజీ మాక్‌ టెస్ట్‌!

సాక్షి, హైదరాబాద్‌: జనరల్‌ మెడిసిన్, రేడియాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, సైకియాట్రీ, అనస్థీషియాలజీ మొదలైన స్పెషలైజేషన్లలో వారి భవిష్యత్‌ కెరీర్‌లకు పునాది వేయడానికి ఔత్సాహిక వైద్యులకు నీట్‌–పీజీ చాలా కీలకమైన పరీక్ష.
NEET-PG Mock Test

పీజీ మెడికల్‌ స్టడీస్‌ ప్రాముఖ్యతను గుర్తిస్తూ, సాక్షి మీడియా గ్రూప్‌ జూన్‌ 16, 2024న.. విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో నీట్‌–పీజీ మాక్‌ పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకుని, మరింత మెరుగుపరచుకోవచ్చు.

చదవండి: College Predictor - 2024 - AP EAPCET TS EAMCET

ఈ మాక్‌ టెస్ట్‌ క్లినికల్‌ నాలెడ్జ్, ఎగ్జామ్‌–టేకింగ్‌ స్ట్రాటజీలను పదును పెట్టడంలో సహాయపడటమే కాకుండా, నిజమైన నీట్‌–పీజీలో రాణించడానికి అభ్యర్థుల సన్నద్ధతను నిర్ధారిస్తుంది. ఈ మాక్‌ పరీక్షకు ‘మై ర్యాంక్‌’టెక్నాలజీ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.  

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

ఆసక్తి గల అభ్యర్థులు రూ. 500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి  https:/ /www.arenaone.in/mock/neetpg ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాగిన్‌ హాల్‌ టికెట్‌ నెంబర్, పాస్వర్డ్‌ పరీక్షకు రెండు రోజుల ముందు అభ్యర్థి రిజిస్టర్‌ చేసుకున్న ఈ–మెయిల్‌ ఐడీ/ఫోన్‌ నెంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.

మాక్‌ పరీక్ష ఆన్‌లైన్‌లో  https://sakshimocktest. myrank.co.in లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా లాగిన్‌ అయి రాసుకోవచ్చు. పరీక్ష సమయం మూడు గంటల 30 నిముషాలు. అలాగే పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను కూడా మీరు చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 99126 71555, 96660 13544, 96665 72244   

Published date : 08 Jun 2024 10:49AM

Photo Stories