NEET 2021: నీట్ స్టేట్ ర్యాంకులు
Sakshi Education
వైద్య విద్యలో చేరేందుకు విద్యార్థులు ఎదురు చూస్తున్న నీట్ స్టేట్ ర్యాంకులు నవంబర్ 23న వెలువడనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ ఎనీ్టఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజి్రస్టార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు.
నీట్ బోర్డు నుంచి రాష్ట్ర ర్యాంకుల వివరాలు నవంబర్ 22 రాత్రికి యూనివర్సిటీకి రానున్నాయి. వాటిని క్రోడీకరించి నవంబర్ 23న మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్ ర్యాంకులను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. ఆ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనున్నారు. నీట్ ఫలితాలు వెల్లడించి 20 రోజులు కావస్తుండగా, కొన్ని సాంకేతిక పరమైన అంశాలతో స్టేట్ ర్యాంకులు ప్రకటించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం స్టేట్ ర్యాంకులు ప్రకటిస్తుండటంతో ఇక అడ్మిషన్ల ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
చదవండి:
EWS: ఈడబ్ల్యూఎస్ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!
Published date : 23 Nov 2021 04:32PM