Skip to main content

NEET Ranker: నీట్‌ ర్యాంకర్‌కు ఆర్థికసాయం

financial assistance to  neet ranker

విద్యానగర్‌(కరీంనగర్‌): నీట్‌లో 979 ర్యాంకు సాధించి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కీర్తి శరణ్యకు మంగళవారం కరీంనగర్‌లోని స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ బాధ్యులు శ్రీనివాస్‌, పద్మలత, సేల్స్‌ టీం సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన కీర్తి శరణ్య నీట్‌లో 979లో ర్యాంకు సాధించినప్పటికీ పై చదువులు చదివే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె పరిస్థితులు తెలుసుకున్న సభ్యులు వారి కార్యాలయంలో రూ.54,525ల చెక్కును శరణ్య, ఆమె తండ్రి లచ్చయ్యలకు అందించారు. ఈ కార్యక్రమంలో స్టార్‌ హెల్త్‌ ఏరియా అసిస్టెంట్‌ మేనేజర్‌ గోపుకుమార్‌, భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అకెనపల్లి నాగరాజుతో పాటు పల్లెర్ల మొండయ్య, శ్రీనివాస్‌, అడిగొప్పుల భాస్కర్‌, నటరాజ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

TSBIE: ఇంటర్‌లోనే ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేలా..

Published date : 26 Jul 2023 03:02PM

Photo Stories