టీఎస్‌ఐసెట్– 2021 ప్రశాతంగా ప్రారంభం..
Sakshi Education
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2021–2022)లో ప్రవేశాలకుడ గాను గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో టీఎస్‌ఐసెట్ ప్రశాంతంగా ప్రారంభమైంది.
కాకతీయ యూనివర్సిటీలోని ఐసెట్ కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పాస్‌వర్డ్ విడుదల చేశారు. ఉదయం ‘ఏ’సెట్ ప్రశ్నపత్రం, మధ్యాహ్నం ‘బి’సెట్ విడుదల చేశారు. తెలంగాణ, ఏపీలో కలిపి 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షకు 22,018 మంది అభ్యర్థులకు గాను 18,701 మంది (85 శాతం) హాజరయ్యారని టీఎస్ ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం రెండో సెషన్‌లో జరిగిన పరీక్షకు 22,018 మందికి గాను 19,198 మంది (87 శాతం) హాజరయ్యారు. శుక్రవారం మూడో సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది.
Published date : 20 Aug 2021 07:20PM