Skip to main content

తెలంగాణ పాఠశాలలకు రూ.19.11 కోట్లు విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ గ్రాంట్‌ను 2020-21 విద్యా సంవత్సరానికి విద్యాశాఖ విడుదల చేసింది.
ఈ మేరకు పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్ పీవీ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 28,645 పాఠశాలలకు రూ. 19,11,50,000 విడుదల చేశారు. ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. కాగా, 15మందిలోపు విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్య ఈసారి(2019-20) పెరిగింది. గతం (2018-19)లో 3,500 వరకు ఉండగా.. ఈసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత కేటగిరీలో 4,178, ఉన్నత పాఠశాలల కేటగిరీలో 23 స్కూళ్లు ఉన్నాయి. ఇక 1,000 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ స్కూళ్లు రాష్ట్రంలో 38 ఉన్నట్లు విద్యా శాఖ లెక్కలు వేసింది. స్కూల్ గ్రాంట్ విడుదల కోసం విద్యాశాఖ ఈ లెక్కలను ప్రాజెక్టు అప్రూవల్ బోర్డుకు
పంపించింది.

ప్రాథమిక, ప్రాథమికోన్నత..

విద్యార్థుల సంఖ్య

పాఠశాలలు

ఒక్కో స్కూల్‌కు గ్రాంటు (రూ.లలో)

1 -15

4,178

12,500

16 - 100

14,784

25,000

101 - 250

2,744

50,000

251 - 1000

246

75,000

1000 కంటే ఎక్కువ

1

1,00,000

మొత్తం

21,953

---

ఉన్నత పాఠశాలలు

1 -15

23

25,000

16 - 100

1,457

25,000

101 - 250

2,812

50,000

251 - 1000

2,364

75,000

1000 కంటే ఎక్కువ

38

1,00,000

Published date : 19 Sep 2020 02:33PM

Photo Stories