ఫిబ్రవరి 3 నుంచి ఏపీఆర్‌సెట్ సర్టిఫికెట్ల పరిశీలన
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన, వైవా పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఏయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య నాయుడు ప్రకటనలో తెలిపారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత తేదీల్లో సంబంధిత విభాగాల్లో హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏపీఆర్‌సెట్ దరఖాస్తు, హాల్‌టికెట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, మార్కుల జాబితాలు, కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు తమ అర్హతలను తెలిపే సర్టిఫికెట్లు, పదో తరగతి మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, పార్ట్‌టైం అభ్యర్థులు సర్వీస్ సర్టిఫికెట్లు, పనిచేసే సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం, ఒక జత అటెస్టెడ్ జిరాక్స్‌లు తీసుకురావాలని పేర్కొన్నారు.
Published date : 28 Jan 2020 02:46PM