Skip to main content

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణలో ఫిబ్రవరి 1నుంచి తరగులు ప్రారంభం కానున్నాయి.
9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ జనవరి 11వ తేదీన ప్రగతిభవన్ లో మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తిరిగి తెరుచుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. కోవిడ్‌ కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలు మూతబడిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1నుంచి క్లాసులు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 10 నెలల అనంతరం విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.
Published date : 11 Jan 2021 04:02PM

Photo Stories