ప్రశాంతంగా తొలిరోజు జేఈఈ మెయిన్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ–ఎన్టీఏ నిర్వహించే జేఈఈ మెయిన్ తొలిరోజు పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి.
ఫిబ్రవరి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి. పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఏపీలో ఈ పరీక్షల నిర్వహణకు 20 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేయగా అన్ని చోట్ల కూడా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫిబ్రవరి సెషన్ పరీక్షలకు రాష్ట్రంలో 87,797 మంది రిజిస్టరయ్యారు. తొలిరోజు పరీక్షలు జరిగిన పేపర్ 2ఏ, పేపర్ 2బీ (బీఆర్క్, బీప్లానింగ్)లకు రిజిస్టరైన వారిలో 80 శాతానికి పైగా హాజరైనట్లు అధికారులు తెలిపారు.
Published date : 24 Feb 2021 05:20PM