పరీక్షల్లో ఫస్టొస్తే ఒక్క రోజు హెచ్‌ఎం!
Sakshi Education
వేలూరు(తమిళనాడు): విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచటానికి పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే బహుమతులు ఇవ్వడం మనకు తెలిసిందే.
కానీ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా నెచ్చల్ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం వినూత్నంగా ఆలో చించారు. అర్ధసంవత్సర పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి అత్యధిక మార్కులు సాధించిన పదోతరగతి విద్యార్థికి ఒక్క రోజు ప్రధానోపాధ్యాయుడిగా పని చేసే అవకా శం ఇస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని మధుమిత (14) 447 మార్కులు సాధించి మొదటి స్థానం లో నిలిచింది. దీంతో హెచ్‌ఎం వెంకటే శన్, ఉపాధ్యాయులు కలసి మధుమితను విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యా యుడి సీటులో కూర్చో పెట్టారు. ఈ సందర్భంగా మధుమిత రిజిస్టర్లను పరిశీ లించి, తన సహ విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలకు సంబంధించి ప్రశ్నలను అడి గారు. అనంతరం హెచ్‌ఎంగా ఒక రోజు పనిచేసిన వేతనాన్ని పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరిన మధుమిత.. ఒక రోజు హెచ్‌ఎంగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది.
Published date : 30 Jan 2020 05:05PM