Skip to main content

పేద విద్యార్థినులకు రోల్స్ రాయ్స్ ‘ఉన్నతి’ శిక్షణ

సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన మహిళా ఇంజనీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ ఆటోమొబైల్, టెక్నాలజీ సంస్థ రోల్స్ రాయ్స్ ముందుకొచ్చింది.
ఇందుకోసం ‘ఉన్నతి’ పేరుతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది. విశాఖలో 100 మంది ఇంజనీరింగ్ మహిళా విద్యార్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు రోల్స్ రాయ్స్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ కిశోర్ జయరామ్ వెల్లడించారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పో సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కిశోర్ జయరామ్ భేటీ సందర్భంగా ఈ ప్రకటన చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డెరైక్టర్ జె.సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నౌకాయానం, ఓడల నిర్మాణ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్‌బిల్డింగ్ (సీఈఎంఎస్)తో కలిసి రోల్స్ రాయ్స్ ఈ నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు సీఈఎంఎస్ శిక్షణ ఇస్తుంది. శిక్షణ ఫీజును రూ.35,400గా సీఎంఎస్ నిర్ణయించగా, దీనిని రోల్స్ రాయ్స్ భరిస్తుంది. 3డీ క్యాడ్, సీఏఈ, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ప్రాసెస్ ఆటోమేషన్, ఎలక్ట్రికల్ డ్రైవ్‌‌స అండ్ స్విచ్ గేర్, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు విద్యార్థినులను ఎంపిక చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై మంత్రి వివరించగా, భాగస్వామ్యమయ్యేందుకు రోల్స్ రాయ్స్ ఆసక్తి చూపినట్లు మంత్రి వెల్లడించారు.
Published date : 11 Feb 2020 01:17PM

Photo Stories