Skip to main content

పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు అప్‌లోడ్ చేయండి: టీఎస్ పభుత్వ పరీక్షల విభాగం

సాక్షి, హైదరాబాద్: మార్చిలో పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థుల (రెగ్యులర్) ఇంటర్నల్ మార్కులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి డీఈవోలను ఆదేశించారు.
ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ (ఫార్మేటివ్ అసెస్‌మెంట్-ఎఫ్‌ఏ) మార్కులను సంబంధిత హెడ్‌మాస్టర్లు వచ్చే నెల 2వ తేదీ నుంచి 21లోగా అప్‌లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. www.bsetelangana.org వెబ్‌సైట్‌లోకి తమ స్కూల్ ఐడీతో లాగిన్ అయి, మార్కులను అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Published date : 18 Feb 2020 03:17PM

Photo Stories