Skip to main content

ఓయూహెల్త్‌కేర్ కోర్సుల ప్రవేశాల గడువు ఫిబ్రవరి 7 వరకుపెంపు

హైదరాబాద్: ఓయూ హెల్త్ కేర్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును ఫిబ్రవరి 7 వరకు పొడగించినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.కిషన్ జనవరి 28 (మంగళవారం)నతెలిపారు.
బుధవారంతో గడువు ముగియనుండగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అపరాధ రుసుము లేకుండా గడువును పొడగించినట్లు పేర్కొన్నారు. ఓయూ పరిధిలోని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలో కొనసాగుతున్న 14 పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇటీవల విడుదలైన డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Published date : 29 Jan 2020 04:58PM

Photo Stories