ముగిసిన జేఈఈ మెయిన్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జనవరి 6వ తేదీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు గురువారంతో ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 11 లక్షల మంది, రాష్ట్రం నుంచి 75 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజు బీఆర్క్/బీప్లానింగ్‌లో ప్రవేశాలకు పేపరు-2, 7వ తేదీ నుంచి బీఈ/బీటెక్‌లో ప్రవేశాలకు పేపరు-1 పరీక్షలను జరిపారు. గురువారం ఉదయం మధ్యాహ్నం పేపరు-1 పరీక్షలో పలు ప్రశ్నలకు ఆప్షన్లలో సరైన సమాధానాలు లేవని విద్యార్థులు పేర్కొన్నారు. ‘కీ’విడుదలయ్యాక వాటిపై స్పష్టత రానుంది. మొదటి రోజు పరీక్షలో కూడా మ్యాథ్స్, కెమిస్ట్రీలో రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవని విద్యార్థులు చెప్పారు.
Published date : 10 Jan 2020 04:43PM