Skip to main content

మార్చి నుంచి హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్లు

వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.
లాటరీ ద్వారానే హెచ్-1బీ వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బెడైన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు.
Published date : 08 Feb 2021 02:49PM

Photo Stories