కొత్తగా 119 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల విద్యార్థులకు శుభవార్త. బీసీ గురుకుల విద్యావనం సరికొత్తగా గుబాళించనుంది.
ఇక్కడ వందలాది విద్యాకుసుమాలు విరబూసే అవకాశం ఏర్పడింది. కార్పొరేట్‌కు దీటుగా దూసుకుపోతున్న గురుకుల విద్యాసంస్థలో 2021–22 విద్యాసంవత్సరం నుంచి 119 జూనియర్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో 2017–18 విద్యాసంవత్సరంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తొలి ఏడాది ఈ పాఠశాలల్లో 5, 6, 7 తరగతుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా, ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెరుగుతూ 2020–21 నాటికి పదో తరగతికి చేరుకున్నారు. నిరుపేద కుటుంబ నేపథ్యం ఉన్న ఈ విద్యార్థులు ఇక్కడ పదో తరగతి వరకు ఉచితవిద్య పొందగా, ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలనే ప్రశ్నకు ప్రభుత్వమే బదులిచ్చింది. 119 గురుకుల పాఠశాలలను గురుకుల జూనియర్ కాలేజీలుగా ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. దీంతో గురుకుల పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసిన వారందరికీ గురుకుల జూనియర్ కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం కలిగింది.
ప్రవేశాలకు దరఖాస్తులు...
బీసీ గురుకులాల పరిధిలో ప్రస్తుతం 19 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలున్నాయి. తాజాగా 119 జూనియర్ కాలేజీలు అప్‌గ్రేడ్ కావడంతో వీటిసంఖ్య 138కు చేరింది. ఇందులో 70 బాలికల, 68 బాలుర జూనియర్ కాలేజీలున్నాయి, కొత్త కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ప్రారంభిస్తుండగా ఇప్పటికే ఉన్న కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపులు నడుస్తున్నాయి. ఒక్కో గ్రూపులో గరిష్టంగా 40 మందికి అడ్మిషన్ ఇస్తారు. ఈ నెల 21 వరకు బీసీ గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతోపాటు అదనంగా మరికొందరికి కూడా ప్రవేశాలు దక్కే అవకాశం ఉంది. సాధారణంగా అర్హత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, కరోనా మూలంగా ఈ ఏడాది అర్హతపరీక్ష నిర్వహించే అవకాశంలేదు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు పదోతరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ మేరకు వెబ్‌సైట్‌లో మార్కులు అప్‌లోడ్ చేసే ఆప్షన్ ఇచ్చాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కూడా ఇదే తరహాలో అడ్మిషన్లు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Published date : 14 Jun 2021 07:43PM