కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఓరియంటల్ స్కిల్స్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జనవరి 19 (ఆదివారం)న ఓ ప్రకటనలో తెలిపింది.
3 నెలల పాటు ఉచిత శిక్షణ, అనంతరం ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొంది. వర్డ్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ ట్యాలీ, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్ ఆఫీస్ ఆటోమేషన్ కోర్సుల్లో శిక్షణ తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కూడా శిక్షణ ఇస్తామని పేర్కొంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలని, పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ చదివి ఉండాలని తెలిపింది. మరిన్ని వివరాలకు 9492672784, 9666366708, 8466099601 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
Published date : 20 Jan 2020 03:06PM