జూన్ 1 నుంచి స్కూళ్లు?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
కరోనా కారణంగా మార్చి 15 నుంచే విద్యా సంస్థలు మూతపడినా పాఠశాల విద్యా అకడమిక్ కేలండర్ ప్రకారం శుక్రవారం నుంచి వేసవి సెలవులు వర్తించనున్నాయి. జూన్ ఒకటిన తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా అదుపులోకి వస్తే జూన్ 1న పాఠశాలలు ప్రారంభమవుతాయని, లేదంటే ఆలస్యం తప్పదని ఓ అధికారి తెలిపారు.
Published date : 24 Apr 2020 04:19PM