జీతాలివ్వని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు: ఏపీ పాఠశాల విద్యాశాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: తమకు కొద్దినెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని వేలాది మంది ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది కొంతకాలంగా విద్యాశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఉద్యోగాలు లేక పలువురు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబ పోషణ కోసం రోడ్లపై కూరగాయలు, చెప్పులు అమ్ముకుంటూ, నిర్మాణ కూలీలుగా మారుతూ ఇతర చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ఈ అంశాలు పాఠశాల విద్యాశాఖ దృష్టికి రావడంతో కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం అన్ని జిల్లాల అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోని సిబ్బందికి జీతాలు ఇవ్వని ఆయా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Published date : 04 Sep 2020 02:15PM