‘జగనన్న సమ్మర్ ఫెలోషిప్– 2021’కు 15 మంది ఎంపిక
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా యువత స్వీయ సమృద్ధి, ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం జగన్ లక్ష్యాలకు అనుగుణంగా.. ‘జగనన్న సమ్మర్ ఫెలోషిప్ 2021’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ముందుకొచ్చిందని సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
జగనన్న సమ్మర్ ఫెలోషిప్‌కు ఎంపికైన 15 మందితో మంగళవారం చల్లా మధుసూదన్‌రెడ్డితోపాటు సంస్థ ఎండీ ఎన్.బంగారరాజు వర్చువల్ సమావేశం నిర్వహించారు. వీరంతా నవరత్నాలు, ఏపీఎస్‌ఎస్‌డీసీ సెల్ఫ్ రెవెన్యూ జనరేషన్, అగ్రికల్చర్ సప్లయి చైన్ అండ్ వ్యాల్యూ అడిషన్, సర్వీస్ సెక్టార్ అండ్ ఎల్డర్లీ కేర్, ఆత్మనిర్భర్ భారత్–పీఎల్‌ఐ స్కీమ్‌లపై మూడు నెలలపాటు అధ్యయనం చేసి అవసరమైన విధానాలు రూపొందించేందుకు కృషి చేస్తారని చెప్పారు.
Published date : 02 Jun 2021 01:19PM