Skip to main content

ఏపీ టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల... నవంబర్ 27, 28 తేదీల్లో తుది జాబితా ప్రకటన!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం రాత్రి తాత్కాలిక తేదీలతో బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించారు. బదిలీలను ఆన్‌లైన్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ముందు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియను ముగించనున్నారు. మొత్తం ప్రక్రియ 43 రోజుల్లో పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించారు.

ఇదీ షెడ్యూల్..

ప్రక్రియ

తేదీ

అడహక్ ప్రమోషన్ కౌన్సెలింగ్

అక్టోబర్ 19-20

రీఅపోర్షన్ ఎక్సర్‌సైజ్

అక్టోబర్ 21-26

స్కూళ్ల వారీగా ఖాళీల సమాచారం ప్రదర్శన

అక్టోబర్ 27-28

హెచ్‌ఎంలు, టీచర్ల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు

అక్టోబర్ 29-నవంబర్2

ఆన్‌లైన్లో దరఖాస్తుల పరిశీలన

నవంబర్ 3-4

ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా

నవంబర్ 5-9

వెబ్‌సైట్ ద్వారా డీఈఓలకు అభ్యంతరాలను ఆధారాలతో సమర్పించడం

నవంబర్ 10-12

అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం

నవంబర్ 13-15

ఫైనల్ సీనియార్టీ జాబితా ప్రదర్శన

నవంబర్ 16-18

ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్ల నమోదు

నవంబర్ 19-21

ఫైనల్ అలాట్‌మెంట్ ప్లేసెస్ లిస్ట్

నవంబర్ 22-27

ఫైనల్ అలకేషన్‌లో సాంకేతిక లోపాలుంటే వాటి పరిశీలన

నవంబర్ 28-29

బదిలీ ఉత్తర్వుల పత్రాల ప్రదర్శన

నవంబర్ 30

Published date : 15 Oct 2020 02:47PM

Photo Stories