ఎన్‌ఐవోఎస్ పరీక్షలు వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దూర విద్యా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఆన్ డిమాండ్ పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐవోఎస్) ప్రాంతీయ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నెల 19 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఈ పరీక్షలను కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామన్న వివరాలను తమ వెబ్‌సైట్‌లో (www.nios.ac.in, https://sdmis.nios.ac.in) అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.
Published date : 20 Mar 2020 03:25PM