ఎడ్వాయ్‌తో ఇక విదేశీ విద్య సులువు
Sakshi Education
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎడ్వాయ్ పేరిట ఆన్‌లైన్‌లో విదేశీ విద్యను ఉచితంగా అందించే యూకేకు చెందిన ఐఈసీ అబ్రాడ్ ఇండియాలో సేవలను ప్రారంభించింది.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విదేశీ కోర్స్‌లు, సెలబస్ కంటెంట్, స్కాలర్‌షిప్ ఎంపికలు, దరఖాస్తు ప్రక్రియ, వసతి, వైద్య బీమా ఇలా విద్యార్థులకు ఎండ్ టు ఎండ్ సేవలందించడం దీని ప్రత్యేకత. భారతీయ విద్యార్థులకు అమెరికా, యూకే, కెనడా, ఐర్లాండ్ వంటి ప్రపంచ దేశాల్లోని విశ్వ విద్యాలయాల దరఖాస్తులను ఒకే చోట చేసుకునే వీలుంటుందని ఎడ్వాయ్ ఫౌండర్ అండ్ సీఈఓ సాదిక్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ ద్వారా విదేశీ విద్యను మరింత సరళీకృతం చేయటమే ఎడ్వాయ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Published date : 21 Aug 2020 02:01PM