అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
హైదరాబాద్: ఎలాంటి కనీస విద్యార్హత లేకున్నా నేరుగా డిగ్రీ చదువుకోవాలనుకునే వారికోసం బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ అర్హత పరీక్ష-2020కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతలేని అభ్యర్థులు 2020-21 విద్యాసంవత్సరం కోసం (బీఏ, బీకాం, బీఎస్సీ) మూడేళ్లు డిగ్రీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కాగా వారికి జూలై 1, 2020 నాటికి 18 సంవత్సరాల వయసు నిండిఉండాలి. విశ్వవిద్యాలయ పోర్టల్ ద్వారా విద్యార్థులు స్టడీ, పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. రూ.300 పరీక్ష ఫీజు, ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. పరీక్షను ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లలో 2020-21 విద్యాసంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చదివేందుకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని అధ్య యన కేంద్రాల్లో లేదా హెల్ప్ డెస్క్ నంబర్ 73829 29570ను సంప్రదించవచ్చని సూచించారు.
Published date : 28 Jan 2020 02:53PM