‘అమ్మ ఒడి’ అర్హులైన తల్లులు వివరాలు సరి చూసుకోవాలి
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం 2020-21 విద్యా సంవత్సరంలో అమలు పరచడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యా శాఖ కార్యాలయంలో గురువారం ఆయన ఈ పథకం అమలు తీరుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనిని మరింత పకడ్బందీగా అమలు చేయటం కోసం సంబంధిత శాఖల అధికారుల అభిప్రాయాలు, సాంకేతిక సమస్యల గురించి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
- జగనన్న అమ్మఒడిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలి.
- అర్హులైన లబ్ధిదారుల జాబితా మొదలు.. తల్లులు, సంరక్షకుల ఖాతాల్లో నగదు జమ అయ్యేంతవరకు సంబంధిత శాఖల ప్రతినిధిని డెప్యూటేషన్ వేయాలి.
- అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకులు తమ బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్సీ కోడ్, రైస్ కార్డు నంబరు వంటి వివరాలను అమ్మఒడి’ వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలి.
- ఆ వివరాలలో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి సరిదిద్దుకోవాలి.
Published date : 11 Dec 2020 03:01PM