ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్ ఎడ్‌సెట్– 2021: ఈసారి అన్ని మెథడాలజీలకు ఒకే పరీక్ష..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ తెలి పారు.
ఈ మేరకు ప్రవేశాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 19 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు రూ. 650గా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 450గా నిర్ణయించి నట్లు చెప్పారు. ఈసారి అన్ని మెథడాలజీలకు ఒకే పరీక్షను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈసారి ఎడ్‌సెట్ రాసేందుకు కొత్తగా అర్హత పొందిన కోర్సులు, ఏయే మెథడాలజీకి ఏయే కోర్సుల వారు అర్హులనే సమగ్ర వివరాలను తమ వెబ్‌సైట్‌లో (https://edcet.trche.ac.in) పొందవచ్చని తెలిపారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
- 19–4–2021: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
- 15–6–2021: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
- 25–6–2021: రూ. 250 ఆలస్య రుసుముతో చివరి గడువు
- 5–7–2021: రూ. 500 ఆలస్య రుసుముతో చివరి గడువు
- 20–7–2021: రూ. 1000 ఆలస్య రుసుముతో చివరి గడువు.
- 24–8–2021: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది.
- 25–8–2021: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ పరీక్ష ఉంటుంది.
Published date : 17 Apr 2021 03:25PM