6, 11 తరగతుల్లో ప్రవేశాలకు 4వ విడత జాబితా విడుదల: కేజీబీవీ
Sakshi Education
సాక్షి, అమరావతి: 2020-21 విద్యా సంవత్సరానికి గాను కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ)ల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థినుల నాలుగో జాబితా బుధవారం విడుదల చేశారు.
ఈ విషయాన్ని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి తెలిపారు. ఎంపికై న విద్యార్థినులు అక్టోబర్ 15 నుంచి 22లోపు ఆధార్ కార్డు, తదితర వివరాలతో సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి. సందేహాల నివృత్తికి 9441270099, 9494383617 నంబర్లను సంప్రదించాలి.
Published date : 15 Oct 2020 02:51PM